Virat Kohli: భార్యపై తనకున్న కేరింగ్ ను చూపిన విరాట్... వైరల్ అవుతున్న ఫొటోలు!

  • మోస్ట్ పాప్యులర్ సెలబ్రిటీ కపుల్స్ గా విరాట్ జంట
  • బెంగళూరు నుంచి ముంబైకి వచ్చిన విరాట్, అనుష్క
  • ఎయిర్ పోర్టులో అనుష్క చేతిని వదలని విరాట్

ఇండియాలోని మోస్ట్ పాప్యులర్ సెలబ్రిటీ కపుల్స్ లో ఒక జంటగా గుర్తింపున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు సంబంధించిన తాజా ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బెంగళూరు నుంచి ముంబైకి వచ్చిన ఈ జంట ఎయిర్ పోర్టులో మీడియా కంట కనిపించింది. తన సతీమణి అనుష్క చేతిని వదలని విరాట్, ఆమెను ఎయిర్ పోర్టు నుంచి బయటకు తీసుకు వచ్చాడు. స్వయంగా డోర్ తీసి కారు ఎక్కించాడు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు, ఎంతైనా విరాట్ కోహ్లీకి అనుష్క అంటే ఎంతో ప్రేమని వ్యాఖ్యానిస్తున్నారు. తన కేరింగ్ ను ఇలా చూపిస్తున్నాడని కితాబునిస్తున్నారు. ఆ ఫొటోలను మీరూ చూడవచ్చు.

More Telugu News