Telangana: కరెంటు బిల్లు రూ. 3,81,571... హైదరాబాద్ మహిళకు షాకిచ్చిన విద్యుత్ బోర్టు!

  • 32 రోజుల కరెంటు బిల్లుగా రూ. 3,81,571
  • 24వ తేదీలోపు చెల్లించాలని నోటీసు
  • సాంకేతిక లోపంతోనేనన్న అధికారులు

తెలంగాణ విద్యుత్ శాఖ అధికారుల నిర్వాకం ఓ మహిళకు షాకిచ్చింది. హైదరాబాద్ పరిధిలోని బోడుప్పల్, శ్రీనివాసనగర్ లో నివాసం ఉంటున్న డి స్వరూప అనే మహిళకు రూ. 3,81,571 కరెంటు బిల్లును అందించిన అధికారులు, ఈ మొత్తాన్ని 24వ తేదీలోగా చెల్లించాలని తేల్చి చెప్పారు. మే 9 నుంచి జూన్ 10 మధ్య ఆమె ఇంట్లో 40,059 యూనిట్ల విద్యుత్ ను వాడారని బిల్లులో వేశారు. విద్యుత్ చార్జీ కింద రూ. 3,79,087, ఆపై అదనపు చార్జ్ గా రూ. 2,403 చెల్లించాలని చెప్పారు.  

ఇక స్వరూపకు వచ్చిన భారీ బిల్లుపై ఉన్నతాధికారులు స్పందించారు. సాంకేతిక లోపం కారణంగానే ఇలా జరిగి ఉండవచ్చని తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్కమ్ కంపెనీ లిమిటెడ్ ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు. మరోసారి ఆమె ఇంటికి మీటర్ రీడింగ్ కోసం ఉద్యోగులను పంపామని తెలిపారు.

More Telugu News