alwal: షాపును తగలబెట్టే క్రమంలో రౌడీ షీటర్ కు అంటుకున్న మంటలు

  • హైదరాబాద్ శివారు ప్రాంతం అల్వాల్ లో సంఘటన
  • మామూలు ఇవ్వడానికి నిరాకరించిన షాపు యజమాని 
  • ఆగ్రహంతో షాపును తగలబెట్టే యత్నంలో గాయాలు

హైదరాబాద్ శివారు ప్రాంతం అల్వాల్ లో రౌడీ షీటర్ నవీన్ నానా హంగామా సృష్టించాడు. నెలకు రూ.10 వేలు మామూళ్లు ఇవ్వాలంటూ ఓ షాపు యజమానిని బెదిరించాడు. సదరు యజమాని అంత మొత్తం ఇవ్వడానికి నిరాకరించాడు. దాంతో ఆ షాపులో ఎవరూ లేని సమయం చూసి పెట్రోల్ పోసి తగులబెట్టేందుకు రౌడీ షీటర్ యత్నించాడు. ఈ క్రమంలో నవీన్ కు మంటలు అంటుకుని గాయాల పాలయ్యాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డైనట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News