Sachin Tendulkar: మూగ జీవాన్ని కాపాడి కూడా విమర్శలు ఎదుర్కొన్న సచిన్!

  • సచిన్ బాల్కనీలోకి వచ్చిన గాయపడ్డ పక్షి
  • మూడు రోజుల పాటు సచిన్ నివాసంలో చికిత్స
  • మూడో రోజు స్వేచ్ఛగా గాల్లోకి ఎగిరిన పక్షి

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మానవత్వంతో చేసిన ఓ మంచి పనిని ఎంతో మంది మెచ్చుకుంటుంటే, కొందరు మాత్రం సెటైర్లు వేస్తున్నారు. అసలేం జరిగిందంటే... సచిన్ ఇంటి బాల్కనీలోకి ఓ పక్షి వచ్చింది. దప్పికతో, గాయాలతో ఎగురలేని పరిస్థితిలో అది ఉంది. దాని పరిస్థితిని గమనించిన సచిన్... ఆహారాన్ని, నీటిని అందించాడు. అయినా ఆ పక్షి కదలలేక పోయింది. దీంతో, చివరకు ఆయన ఓ ఎన్జీవోకు ఫోన్ చేశాడు.

సచిన్ నివాసానికి వచ్చిన ఎన్జీవో సిబ్బంది... దానికి వైద్యం అందించారు. మూడు రోజుల తర్వాత పక్షి పూర్తిగా కోలుకుని, స్వేచ్ఛగా గాల్లోకి ఎగిరింది. ఈ వీడియోను సచిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మానవత్వంతో సచిన్ చేసిన పనిని ఎంతోమంది అభినందించారు. కొందరు మాత్రం అన్ని జీవులపై ఇలాంటి ప్రేమనే చూపించాలని... మాంసాహారం మానేసి, శాకాహారమే భుజించాలని... మీరు నిర్వహిస్తున్న హోటళ్లలో కూడా శాకాహారాన్నే అందించాలంటూ సెటైర్లు వేశారు.

More Telugu News