Donald Trump: ప్రపంచానికి పెను ముప్పుగా మారిన పెద్ద సమస్యను మేము పరిష్కరిస్తున్నాం: ట్రంప్

  • ఇరు దేశాల మధ్య వార్‌ గేమ్‌లు ఇక ఉండవు
  • వాటి వల్ల చాలా ధనం కూడా వృథా అవుతోంది 
  • మేము భవిష్యత్తులో కిమ్‌ను వైట్‌హౌస్‌కు ఆహ్వానిస్తాం 
  • ఉత్తరకొరియా అధినేతతో భేటీ తరువాత ట్రంప్‌

కొరియా ద్వీపకల్పంలో తమ మిలటరీ కార్యకలాపాలు జరపడం ఆపేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అన్నారు. ఈరోజు సింగపూర్‌లో ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌తో భేటీ అనంతరం ట్రంప్‌ మాట్లాడుతూ... ఇరు దేశాల మధ్య వార్‌ గేమ్‌లు ఇక ఉండవని, వాటి వల్ల చాలా ధనం వృథా అవుతోందని చెప్పారు. తాము భవిష్యత్తులో కిమ్‌ జాంగ్‌ ఉన్‌ను వైట్‌హౌస్‌కు ఆహ్వానిస్తామని తెలిపారు.

ప్రపంచ శాంతికి తాము ఏదో ఒకటి చేయాలనుకుంటున్నామని, తమ మధ్య ప్రత్యేక బంధం ఏర్పరచుకున్నామని, ప్రజలు ఆనందంతో ఉంటారని ట్రంప్‌ చెప్పారు. ప్రపంచానికి పెను ముప్పుగా మారిన పెద్ద సమస్యను తాము పరిష్కరిస్తున్నామని, తనతో సమయాన్ని గడిపిన కిమ్‌కు అభినందనలని అన్నారు. ఈ భేటీ ద్వారా అమెరికా, ఉత్తర కొరియాలకే ఎక్కువ మేలు జరిగిందని, కిమ్‌తో భేటీ అవడం గౌరవంగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు.     

More Telugu News