redmi 6 6a: స్వదేశంలో రెడ్ మీ 6, 6ఏ ఫోన్లను విడుదల చేసిన షియోమీ

  • వీటి ధరలు రూ.8,400, రూ.6,300
  • రెండింటిలోనూ 18:9యాస్పెక్ట్ రేషియో స్క్రీన్
  • హీలియో పీ22 ప్రాసెసర్

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ షియోమీ రెడ్ మీ బ్రాండ్ పై 6, 6ఏ ఫోన్లను ఈ రోజు స్వదేశంలో విడుదల చేసింది. రెడ్ మీ 5 సిరీస్ కు ఇవి తదుపరి వెర్షన్. జూన్ 15 నుంచి అమ్మకాలు ప్రారంభిస్తోంది.

రెడ్ మీ 6లో 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ ధర చైనాలో 799 యువాన్లు. మన రూపాయిల్లో రూ.8,400. 4జీబీ ర్యామ్, 64జీబీ ర్యామ్ ధర మన కరెన్సీలో రూ.10,500. రెడ్ మీ 6ఏ ధర మన కరెన్సీలో రూ.6,300. రెడ్ మీ 6లో 18:9 యాస్పెక్ట్ రేషియో స్క్రీన్, 5.45 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. ఫేస్ అన్ లాక్, 12+5 ఎంపీ డ్యుయల్ కెమెరా, హీలియో పి22 ప్రాసెసర్ ఉన్నాయి.

రెడ్ మీ 6ఏలో మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్, 5.4 అంగుళాల డిస్ ప్లే, 18:9 యాస్పెక్ట్ రేషియో స్క్రీన్, వెనుక భాగంలో 13ఎంపీ కెమెరా, ముందు భాగంలో 5ఎంపీ కెమెరా, 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజీ ఉన్నాయి. షియోమీ చైనాలో విడుదల చేసే ప్రతీ మోడల్ ను భారత్ లోనూ తీసుకొస్తున్న విషయం తెలిసిందే. 

More Telugu News