USA: ఎట్టకేలకు ఉత్తరకొరియా-అమెరికాల మధ్య కుదిరిన ఒప్పందం

  • ప్రపంచం పెద్ద మార్పును చూస్తుంది: కిమ్
  • కిమ్ తో ప్రత్యేక బంధం ఏర్పడింది
  • వైట్ హౌస్ కు తప్పకుండా ఆహ్వానిస్తా: ట్రంప్

ఉత్తరకొరియా, అమెరికాల మధ్య ఎట్టకేలకు కీలక ఒప్పందం జరిగింది. డోనాల్డ్ ట్రంప్, కిమ్ జాంగ్ ఉన్ మధ్య సింగపూర్ లోని సెంటోసా ఐల్యాండ్ లో క్యాపెల్లా హోటల్ లో భేటీ అనంతరం ఇరువురు చారిత్రాత్మకమైన ఒప్పందంపై సంతకాలు చేశారు.

కిమ్ తో చాలా ప్రత్యేకమైన బంధం ఏర్పడిందని ట్రంప్ పేర్కొన్నారు. వైట్ హౌస్ (అమెరికా అధ్యక్ష భవనం)కు కిమ్ ను తప్పకుండా ఆహ్వానిస్తానని చెప్పిన ట్రంప్... ఉత్తరకొరియా అణు నిరాయుధీకరణ వెంటనే మొదలవుతుందని ప్రకటించారు. అంచనాలకు మించి తమ భేటీ జరిగిందని చెప్పారు.

ఏ ఒప్పందంపై సంతకాలు జరిగాయని జర్నలిస్టులు ప్రశ్నించగా... త్వరలోనే తెలుస్తుందన్నారు ట్రంప్. ఈ సందర్భంగా ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మాట్లాడుతూ... ప్రపంచం పెద్ద మార్పును చూస్తుందని, తాను సమగ్ర ఒప్పందంపై సంతకం చేశానని తెలిపారు. 

More Telugu News