srinivas reddy: మొదట్లో ఇక్కడ కనీసం ఐదేళ్లు కష్టపడాలి!: కమెడియన్ శ్రీనివాస రెడ్డి

  • ఎంతో అంకితభావం ఉండాలి 
  • అవకాశాల కోసం అదేపనిగా తిరగాలి 
  • ఆరోగ్యం .. ఆర్ధిక స్థితి ముఖ్యం   

తెలుగు తెరపై సందడి చేసే హాస్య నటుల్లో శ్రీనివాస రెడ్డి ఒకరు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కుంటూ ఆయన ఈ రోజున ఈ స్థాయికి వచ్చారు. ఒక వైపున స్టార్ హీరోల సినిమాల్లో సందడి చేస్తూనే .. మరో వైపున హాస్యరస ప్రధానమైన సినిమాల్లో హీరో అనిపించదగిన ప్రధానమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు. అలాంటి శ్రీనివాస రెడ్డి తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

కొత్తగా సినిమాల్లోకి రావాలకునేవారి గురించి ఆయన తనదైన శైలిలో స్పందించారు. "చిత్రపరిశ్రమలోకి ఎంతో అంకితభావంతో అడుగుపెట్టవలసి ఉంటుంది. ఇక్కడికి రాగానే విస్తరి వేసి ఎవరూ ఏమీ పెట్టేయరు. ఒక ఐదు సంవత్సరాలపాటు కష్టపడగలగాలి .. అందుకు అవసరమైన ఆర్ధిక స్థితి అవసరం. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అవకాశాల కోసం తిరుగుతూ ఉండాలి. ఈగోకి పోకుండా ప్రతి ఒక్కళ్లను అవకాశాలు అడుగుతూ ఉండాలి. ఇలా తక్కువలో తక్కువ ఓ ఐదేళ్లు కష్టపడితే గుర్తింపు తెచ్చిపెట్టే వేషం దొరికే అవకాశం ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.   

More Telugu News