Ritu Varma: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • తమిళంలో బిజీ అవుతున్న రీతూవర్మ
  • నాగార్జున సీక్వెల్ కి స్క్రిప్టు రెడీ 
  • విక్రం సినిమా ట్రైలర్ కు కోటి వ్యూస్

*  'పెళ్లిచూపులు' ఫేం రీతూవర్మ తమిళంలో ఓ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా దేసింగ్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇప్పటికే తమిళంలో విక్రం సరసన ఓ చిత్రాన్ని చేసిన రీతూవర్మ మెల్లగా అక్కడ బిజీ అవుతోంది.
*  నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఆమధ్య వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి విదితమే. ఈ ప్రాజక్టుకు సంబంధించిన స్క్రిప్టును దర్శకుడు రెడీ చేశాడు. త్వరలో నాగార్జునకు వినిపించి ముందుకు ప్రొసీడ్ అవుతాడట.
*  విక్రం హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం 'సామీ స్క్వేర్' ట్రైలర్ యూ ట్యూబ్ లో దూసుకుపోతోంది. ఇప్పటికి ఈ ట్రైలర్ కోటి వ్యూస్ ను సొంతం చేసుకుని రికార్డు కొట్టింది. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది.

More Telugu News