Arvind Kejriwal: అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారు: కేజ్రీవాల్ పై పిటిషన్ వేసిన ఆప్ తిరుగుబాటు ఎమ్మెల్యే

  • 27 సెషన్లు జరిగితే 7 సెషన్లకు మాత్రమే హాజరయ్యారు
  • 40 నెలలుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమాలకు హాజరు కావడం లేదు
  • కేజ్రీవాల్ అసెంబ్లీకి హాజరయ్యేలా చూడండి

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై ఢిల్లీ హైకోర్టులో ఆప్ తిరుగుబాటు ఎమ్మెల్యే కపిల్ మిశ్రా పిటిషన్ వేశారు. అసెంబ్లీలో కేజ్రీవాల్ హాజరు చాలా తక్కువగా ఉందని... ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని పిటిషన్ లో కోరారు. 2017లో 27 అసెంబ్లీ సెషన్లు జరిగితే కేజ్రీవాల్ కేవలం 7 సెషన్లకు మాత్రమే హాజరయ్యారని ఆరోపించారు.

కీలకమైన మంచినీటి శాఖను కూడా కేజ్రీవాల్ నిర్వహిస్తున్నారని... ఢిల్లీ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో, తన పిటిషన్ కు చాలా ప్రాధాన్యత ఉందని అన్నారు. ప్రజల సమస్యలపై ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు కేజ్రీవాల్ ను అసెంబ్లీకి హాజరయ్యేలా చూడాలని... దీనికి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్, స్పీకర్ కు కూడా ఆదేశాలివ్వాలని కోరారు. గత 40 నెలలుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి కేజ్రీవాల్ హాజరు కావడంలేదని... ప్రజా సమస్యలపై ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థమవుతోందని అన్నారు. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.

More Telugu News