sensex: చివర్లో అమ్మకాల ఒత్తిడితో స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు

  • మధ్యాహ్నం 200 పాయింట్ల లాభంలో సెన్సెక్స్ 
  • చివర్లో అమ్మకాలకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
  • 40 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్

భారతీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. మధ్యాహ్నం సమయానికి 200 పాయింట్ల లాభంలో ఉన్న సెన్సెక్స్ చివర్లో అమ్మకాల ఒత్తిడికి లోనై లాభాలను కోల్పోయింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 40 పాయింట్ల లాభంతో 35,483 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 19 పాయింట్లు పెరిగి 10,483 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అలెంబిక్ ఫార్మా (19. 87%), జైకార్స్ లిమిటెడ్ (19.25%), కార్పొరేషన్ బ్యాంక్ (10.18%), పీసీ జువెలర్స్ (6.54%), సెంట్రల్ బ్యాంక్ (5.99%).

టాప్ లూజర్స్:
క్వాలిటీ (-4.98%), క్రిసిల్ (-4.49%),గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ లిమిటెడ్ (-4.06%), గృహ్ ఫైనాన్స్ లిమిటెడ్ (-3.60%), దిలీప్ బిల్డ్ కాన్ లిమిటెడ్ (-3.32%).

More Telugu News