Kamal Haasan: 'విశ్వరూపం-2' ట్రైలర్ చూశాను.. కాసేపట్లో షేర్‌ చేస్తాను: జూ.ఎన్టీఆర్‌

  • ఈరోజు సాయంత్రం 5 గంటలకు ట్రైలర్‌ విడుదల
  • ట్రైలర్‌ కోసం ఊపిరి బిగపట్టుకుని ఉండండి అంటోన్న ఎన్టీఆర్‌
  • సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ అయిన తారక్

సినీనటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనపడుతున్నాడు. అప్పట్లో తారక్‌ చాలా అరుదుగా పోస్టులు చేసేవాడు. కానీ, ఇప్పుడు రూటు మార్చేసి ట్విట్టర్‌లో తనకు సంబంధించిన విషయాలను, పలు సినిమాల విశేషాలను, వీడియోలను పోస్ట్ చేస్తున్నాడు.

తాజాగా, ఆయన ఓ పోస్ట్ చేస్తూ తాను 'విశ్వరూపం-2' ట్రైలర్‌లో సినీనటుడు కమలహాసన్‌ విశ్వరూపాన్ని చూశానని, ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ ట్రైలర్‌ను షేర్‌ చేయాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. ట్రైలర్‌ కోసం ఊపిరి బిగపట్టుకుని ఉండండంటూ ఆసక్తి పెంచాడు.  

More Telugu News