Revanth Reddy: స్పీకర్‌ మధుసూదనాచారిని గట్టిగా నిలదీసిన రేవంత్‌రెడ్డి.. వాగ్వివాదం!

  • కొన్ని నెలల క్రితం ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు 
  • మధుసూదనాచారి వద్దకు వచ్చిన కాంగ్రెస్‌ నేతల బృందం
  • కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయలేదన్న రేవంత్‌రెడ్డి

అసెంబ్లీలో దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సంపత్‌ కుమార్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలపై తెలంగాణ శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. హైకోర్టులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది. ఈరోజు సభాపతి మధుసూదనాచారి వద్దకు వచ్చిన కాంగ్రెస్‌ నేతల బృందం సదరు ఎమ్మెల్యేల సభ్యత్వాలను పునరుద్ధరించాలని కోరింది.

కాగా, న్యాయస్థానం తీర్పును ఎందుకు అమలు చేయడం లేదంటూ స్పీకర్‌ మధుసూదనాచారిని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి నిలదీశారు. స్పీకర్ వైఖరి బాగోలేదని విమర్శించారు. దీంతో స్పీకర్‌ స్పందిస్తూ, మీరిలా మాట్లాడితే తాను వెళ్లిపోతానని అన్నారు. దాంతో రేవంత్‌రెడ్డిని సీఎల్పీ నేత జానారెడ్డి వారించడంతో వాగ్వివాదం సద్దుమణిగింది. 

More Telugu News