kohli: అదంతా ఒట్టిదే.. నా గడ్డానికి ఎలాంటి బీమా చేయించలేదు: విరాట్ కోహ్లీ

  • కొన్ని రోజులుగా చాలా మంది దీని గురించే మాట్లాడుకుంటున్నారు
  • నా గడ్డానికి బీమా చేయించినట్టు ఇటీవల ఓ వీడియో విడుదలైంది
  • ఇదంతా ఓ యాడ్ లో భాగం

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన గడ్డానికి బీమా చేయించుకున్నాడనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి . ‘నీ గడ్డానికి బీమా తీసుకున్నావన్న వార్త నేను బయటకు వెల్లడించాను’ అంటూ క్రికెటర్ రాహుల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అయినప్పటికీ, కోహ్లీ నిజంగా తన గడ్డానికి బీమా చేయించాడా? లేదా? అనే అనుమానాలు అభిమానుల్లో ఉండిపోయాయి.

ఈ నేపథ్యంలో కోహ్లీ స్పందిస్తూ అసలు విషయం బయటపెట్టాడు. కొన్ని రోజులుగా చాలా మంది తన గడ్డం గురించే మాట్లాడుకుంటున్నారని, తన గడ్డానికి ఎటువంటి బీమా చేయించలేదని స్పష్టం చేశాడు. ఇందుకు సంబంధించి ఇటీవల విడుదలైన ఓ వీడియో తాను చేసిన ఓ యాడ్ లో భాగమని తేల్చి చెప్పేశాడు. కాగా, ఈ నెల చివరి వారంలో టీమిండియాతో కలిసి ఐర్లాండ్ పర్యటనకు కోహ్లీ వెళ్లనున్నాడు.  

More Telugu News