chidambaram: ఆ విధంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించండి: చిదంబరం

  • పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ధరలు తగ్గుతాయి
  • ఎన్డీఏ సర్కారు విధానపరమైన తప్పిదాలు చేస్తోంది
  • భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి

పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ధరలు తగ్గుతాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం అన్నారు. ఈరోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీఏ సర్కారు తీసుకున్న విధానపరమైన తప్పిదాలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపాయని అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే వెంటనే ధరలు తగ్గుతాయని అన్నారు.

మే, 2014లో ముడిచమురు ధరలతో పోల్చితే లీటర్‌ పెట్రోలుపై ఇప్పుడు రూ.25 పెరిగేలా చేశారని చిదంబరం అన్నారు. తాను ఇప్పుడు ఒక్కసారిగా లీటర్‌కు రూ.25 తగ్గించమని చెప్పట్లేదని, రూ.5 లేక 6 లేక 7 రూపాయల చొప్పున తగ్గించుకుంటూ రండని అన్నారు. ఒక పైసా చొప్పున ఎందుకు తగ్గిస్తున్నారని ప్రశ్నించారు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు భారత్‌పై ప్రభావం చూపుతున్నాయని తాను అనుకోవట్లేదని చిదంబరం అన్నారు. పాలన చేతకాకపోవడమే మన ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోందని చెప్పారు. 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, అందరినీ కలుపుకుని జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను తీసుకురండని సూచించారు. 

More Telugu News