శ్రీదేవిని చూసినట్టుగా సన్నీలియోన్ ను ఎందుకు చూడరు?: హార్దిక్ పటేల్

11-06-2018 Mon 13:33
  • తెరపై స్వతంత్రంగా ఆమెను ఎందుకు చూడరు?
  • శ్రీదేవి, నర్గీస్, మాధురీదీక్షిత్ మాదిరిగా చూస్తే తప్పేంటి?
  • ఆమెను గత కాలపు పోర్న్ స్టార్ గానే  చూస్తే ఈ దేశం ఎప్పటికీ మారదు
అశ్లీల చిత్రాల తార నుంచి బాలీవుడ్ స్టార్ గా ఎదిగిన సన్నీలియోన్ కు గుజరాత్ యువనేత హార్దిక్ పటేల్ మద్దతుగా నిలిచారు. పోర్న్ స్టార్ అనే గత కాలపు ఇమేజ్ తోనే ఆమెను చూస్తే ఈ దేశం మారదని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

‘‘సన్నీ లియోన్ ను ఆమె గత కాలపు ఇమేజ్ కు భిన్నంగా స్క్రీన్ పై స్వతంత్రంగా ఎందుకు చూడరు? నటీమణులు నర్గీస్, శ్రీదేవి లేదా మాధురీదీక్షిత్ మాదిరిగా ఆమెను కూడా చూడడం వల్ల వచ్చిన ఇబ్బందేమిటి? మన ఆలోచన అలాగే ఉంటే, సన్నీలియోన్ ను ఇప్పటికీ పోర్న్ స్టార్ గానే చూడాలనుకుంటే ఈ దేశం ఎప్పటికీ మారదు’’ అని హార్దిక్ పటేల్ అన్నారు.  2019 ఎన్నికల్లో మోదీ మరోసారి ప్రధాని అయితే ఇక ఆ తర్వాత ఎన్నికలే ఉండవని అభిప్రాయపడ్డారు.