Etela Rajender: చర్చలు సఫలం.. ఆర్టీసీ కార్మికులకు శుభవార్త చెప్పిన తెలంగాణ మంత్రి ఈటల

  • 16 శాతం మధ్యంతర భృతి ఇస్తాం
  • కేసీఆర్‌ ఒప్పుకున్నారు
  • ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ పెంచుతున్నాం

ఆర్టీసీ కార్మికులతో తెలంగాణ ప్రభుత్వం చేసిన చర్చలు సఫలమయ్యాయి. తెలంగాణ వచ్చాక ఆర్టీసీ కార్మికుల వేతనాలను సీఎం కేసీఆర్‌ వెంటనే పెంచారని, టీఎస్‌ ఆర్టీసీ రోజుకు 93 లక్షల మందిని తమ గమ్యస్థానాలకు చేర్చుతోందని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆర్టీసీ కార్మికుల జీతభత్యాల విషయంలో చర్చించామని అన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారని చెప్పారు.

ఆనాడు తెలంగాణ ఉద్యమంలోనూ ఆర్టీసీ కీలక పాత్ర పోషించిందని ఈటల రాజేందర్‌ అన్నారు. ఆర్టీసీ కార్మికులకు 16 శాతం మధ్యంతర భృతికి అంగీకరించారని చెప్పారు. నాలుగు రోజులుగా ఈ విషయంపై చర్చోపచర్చలు చేశామని అన్నారు. కాగా, కార్మిక సంఘాలు 25 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేసినా, చర్చల అనంతరం 16 శాతానికి ఒప్పుకున్నాయి. పెంచిన మధ్యంతర భృతి వచ్చేనెల నుంచి అమలుకానుంది.   

More Telugu News