spinner rashid: ఆయనకు బౌలింగ్ చేయలేకపోవడం నా దురదృష్టం: స్పిన్నర్ రషీద్ ఖాన్

  • సచిన్ టెండూల్కర్ కి బౌలింగ్ చేయాలనేది ప్రతి ఒక్క బౌలర్ కల
  • అలాంటి ఆటగాడికి నేను బౌలింగ్ చేయలేకపోయా
  • కోహ్లీకి బౌలింగ్ చేయడాన్ని బాగా ఆస్వాదిస్తా

ఇటీవల విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ లో ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్  నంబర్ వన్ ర్యాంక్ సాధించాడు. ఈ నెల 14 నుంచి బెంగళూరు వేదికగా భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రషీద్ ఖాన్ ఆసక్తికర విషయాలు చెప్పాడు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే బెస్ట్ బ్యాట్స్ మెన్ అని, కోహ్లీకి బౌలింగ్ చేయడాన్ని బాగా ఆస్వాదిస్తానని చెప్పాడు. అయితే, ఓ అంసతృప్తి మాత్రం తనలో ఉండిపోయిందని చెప్పాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కి బౌలింగ్ చేయాలనేది ప్రతి ఒక్క బౌలర్ కల అని, అలాంటి ఆటగాడికి తాను బౌలింగ్ చేయలేకపోవడాన్ని దురదృష్టంగా భావిస్తున్నానని, మళ్లీ అలాంటి ఆటగాడు క్రికెట్ లోకి వస్తాడని తాను అనుకోవట్లేదని అన్నాడు.

More Telugu News