Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • పట్టుదల ఎక్కువే అంటున్న కాజల్ 
  • నవంబర్ నుంచి రాజమౌళి మల్టీస్టారర్
  • 'వెంకీమామ' షూటింగుకి ఏర్పాట్లు 
  • కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రేమకథ

*  తనలో పట్టుదల పాళ్లు కాస్త ఎక్కువే.. అంటోంది అందాలభామ కాజల్. 'ఏదైనా అనుకుంటే అది సాధించేవరకు నిద్రపట్టదు. ఆ పని పూర్తయ్యే వరకు కుదురుగా ఉండను. అందుకోసం రోజుకి ఎన్ని గంటలైనా పనిచేస్తాను. నా పట్టుదల అలాంటిది' అని చెప్పింది.
*  ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం షూటింగ్ వచ్చే నవంబర్ నుంచి జరుగుతుంది.
*  వెంకటేశ్, నాగ చైతన్య హీరోలుగా ఓ మల్టీ స్టారర్ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే. బాబి దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగును వచ్చే నెల నుంచి నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనికి 'వెంకీమామ' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు.
*  గత కొన్నాళ్లుగా సక్సెస్ కు దూరంగా వున్న ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ త్వరలో మరో చిత్రాన్ని చేయనున్నాడు. అంతా కొత్త వాళ్లు నటించే ఈ చిత్రాన్ని ప్రేమకథగా తెరకెక్కిస్తాడట.  

More Telugu News