BJP: తగ్గిన ప్రజాదరణ.. బీజేపీ సొంత సర్వే... నేతల్లో ఆందోళన!

  • గత ఎన్నికల్లో బీజేపీకి 282 స్థానాలు
  • 152 నియోజక వర్గాల్లో ఓటర్లు బీజేపీ పట్ల వ్యతిరేకత
  • సిట్టింగు ఎంపీలు కాకుండా కొత్తవారు పోటీలోకి?

గత సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ హవాతో తిరుగులేని మెజార్టీతో గెలిచి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ గత ఎన్నికల్లో 282 స్థానాలు గెలుచుకుంది. అయితే, వచ్చే ఎన్నికల్లో మాత్రం తమ పార్టీకి ఎదురుదెబ్బ తగులుతుందని బీజేపీ నిర్వహించిన ఓ సర్వేలో తేలినట్టు తాజా సమాచారం. గత ఎన్నికల్లో గెలిచిన 282 స్థానాల్లో కనీసం 152 నియోజక వర్గాల్లో ఓటర్లు బీజేపీ పట్ల వ్యతిరేకతతో ఉన్నట్టు ఈ సర్వే చెబుతోంది.

దీంతో ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగు ఎంపీలను కాకుండా కొత్తవారిని పోటీలోకి దించాలని బీజేపీ యోచిస్తున్నట్టు సమాచారం. ఇటీవల ఢిల్లీలో జరిగిన మూడు నగరపాలక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అనేక స్థానాల్లో కొత్తవారిని పోటీకి దింపి విజయం సాధించింది. దీంతో ఆ ప్రయోగాన్నే వచ్చే ఎన్నికల్లోనూ చేయాలనుకుంటోంది.

75 ఏళ్లు నిండిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదని గతంలో బీజేపీ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పుడు ఆ నిబంధనను తొలగిస్తున్నారు. తనకు పట్టున్న రాష్ట్రాల్లోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల నుంచి మరిన్ని సీట్లు గెలుచుకునేందుకు బీజేపీ ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటోంది.         

More Telugu News