jobs: ఉద్యోగాలు రావాలంటారు.. మరోవైపు పరిశ్రమలకు అడ్డుపడతారు: చంద్రబాబు

  • అప్పట్లో పట్టిసీమకు అడ్డుపడ్డారు
  • పోలవరం విషయంలోనూ రైతులను రెచ్చగొట్టారు
  • ఆక్వా ఫుడ్‌ పార్కుకు కొందరు అడ్డుపడ్డారు
  • ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలి

తాము అనుకున్న సమయానికి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, కోర్టులకు వెళ్లినా తాము ఇప్పటికే పలు ప్రాజెక్టులను పూర్తి చేశామని అన్నారు. అప్పట్లో పట్టిసీమకు అడ్డుపడ్డారని, పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ చాలా సార్లు రైతులను రెచ్చగొట్టారని చెప్పారు.

మరోవైపు ఆక్వా ఫుడ్‌ పార్కు వంటి పలు విషయాలకు కొందరు అడ్డుపడ్డారని చంద్రబాబు అన్నారు. పరిశ్రమలు వస్తే చాలా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఓవైపు ఉద్యోగాలు రావాలంటారని, మరోవైపు తమిళనాడులో జరిగిన జల్లికట్టు పోరాట స్ఫూర్తితో అంటూ మళ్లీ వాటికి అడ్డు పడతారని విమర్శించారు. జట్టికట్టుకి, దీనికి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలు ఉప ఎన్నికలు రాకుండా ఆలస్యంగా రాజీనామాలు చేస్తున్నారని అన్నారు.

అగ్రిగోల్డ్ అంశంపై లబ్దిదారులకు న్యాయం జరగాలని తాము కృషి చేస్తోంటే మరోవైపు దానిపై కూడా విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఎన్నో సమస్యలు సృష్టిస్తున్నారని అయినప్పటికీ తాము సమర్థవంతంగా ముందుకు వెళుతున్నామని అన్నారు. తాము దేశంలో ఎక్కడా జరగని సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. 

More Telugu News