kalyan dev: 'విజేత' ఆడియో ఫంక్షన్ కి చిరూతో పాటు చరణ్ .. బన్నీ!

  • కల్యాణ్ దేవ్ హీరోగా 'విజేత'
  • కథానాయికగా మాళవిక నాయర్ 
  • జూలైలో భారీ స్థాయి విడుదల  

చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా రాకేశ్ శశి దర్శకత్వంలో 'విజేత' సినిమా రూపొందింది. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాలో, కల్యాణ్ దేవ్ జోడీగా మాళవిక నాయర్ నటించింది. జూలైలో ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను ఘనంగా నిర్వహించనున్నారు.ఈ వేడుకకి ముఖ్య అతిథిగా చిరంజీవి రానున్నారు. ఆయనతో పాటు చరణ్ .. బన్నీ కూడా రానున్నారనేది తాజా సమాచారం. భారీస్థాయిలో ఈ సినిమాకి ప్రచారాన్ని కల్పించే ఉద్దేశంతోనే మెగా హీరోలంతా వేదికపై సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. నటనతో పాటు డాన్సులు .. ఫైట్ల విషయంలో శిక్షణ తీసుకున్న కల్యాణ్ దేవ్, ఈ సినిమాతో రంగంలోకి దిగాడు. ఈ సినిమాతో ఆయన మెగా అభిమానుల నుంచి ఎన్ని మార్కులు కొట్టేస్తాడో చూడాలి మరి.    

More Telugu News