pancard: ఒకటి కన్నా ఎక్కువ పాన్‌కార్డులు ఉంటే రూ.10,000 జరిమానా.. ఇలా రద్దు చేసుకోండి!

  • రెండు పాన్‌ కార్డులు కలిగి ఉంటే చట్ట విరుద్ధం
  • ఆన్‌లైన్‌లో రద్దు చేసుకునే అవకాశం
  • https://www.incometaxindia.gov.in ద్వారా రద్దు

ఒకే వ్యక్తి వద్ద ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉండటం చట్ట విరుద్ధమని, ఆదాయపు పన్ను చట్టం 1961, సెక్షన్ 272 బి ప్రకారం జరిమానా తప్పదని సదరు శాఖ హెచ్చరించింది. ఒకవేళ మీ వద్ద రెండు లేక మూడు పాన్ కార్డులు ఉంటే వెంటనే వాటిని ఆన్‌లైన్‌ లేక ఆఫ్‌లైన్‌ ద్వారా రద్దు చేసుకోవాలని సూచించింది. రెండు పాన్‌ కార్డులు కలిగి ఉంటే రూ.10,000 వరకు జరిమానా పడుతుందని పేర్కొంది.
                               
ఒకే పాన్‌ కార్డును వాడుతూ మిగతావి రద్దు చేయాలని సూచించింది. ఇందుకోసం https://www.incometaxindia.gov.in పేజీలోకి వెళ్లాలి. అందులో ఎడమ వైపు కింద ఇంపార్టెంట్‌ లింక్స్‌ ట్యాబ్‌పై క్లిక్‌ చేయండి. అప్లయ్‌ ఫర్‌ పాన్‌ అనే బటన్‌ క్లిక్‌ చేస్తే.. కొత్త పేజ్‌ తెరుచుకుంటుంది. UTITSL అనే ట్యాబ్‌  క్లిక్‌ చేసి సీఎస్‌ఎఫ్‌ ఫాంలో ఐటెం నెం.11లో మీ వద్ద ఉన్న రెండో పాన్‌ కార్డు వివరాలు ఇస్తే అది రద్దవుతుంది.      

More Telugu News