hafeez saeed: పాకిస్థాన్ ఎన్నికలకు దూరంగా తీవ్రవాది హఫీజ్ సయీద్!

  • మిల్లీ ముస్లిం లీగ్ పార్టీని స్థాపించిన హఫీజ్
  • ఎన్నికల సంఘం వద్ద ఇంకా కాని రిజిస్ట్రేషన్
  • అల్లాహూ అక్బర్ పార్టీ నుంచి అనుచరుల పోటీ

జమాత్ ఉద్ దవా వ్యవస్థాపకుడు, ముంబై మారణహోమం సూత్రధారి హఫీజ్ సయీద్ పాకిస్థాన్ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడం లేదట. ఇటీవలే మిల్లీ ముస్లిం లీగ్ అనే రాజకీయ పార్టీని సయీద్ ప్రారంభించాడు. అయితే, ఇంత వరకు పార్టీని ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు.

 ఈ నేపథ్యంలో, సయీద్ పార్టీ అభ్యర్థులు అల్లాహూ అక్బర్ తెహ్రీక్ (ఏఏటీ) పార్టీ తరపున పోటీ చేయబోతున్నారని సమాచారం. ఏఏటీ పార్టీ తరపున సయీద్ అనుచరులు ఎన్నికల్లో పోటీ చేస్తారని జమాత్ ఉద్దవా నేతలు తెలిపారు. దేశ వ్యాప్తంగా 200 మంది హఫీజ్ అనుచరులు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు సమాచారం. వీరందరికీ ఏఏటీ పార్టీ టికెట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. 

More Telugu News