Tollywood: రామ్ చరణ్ ఫొటో పోస్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్

  • సోఫాలో కూర్చుని ఉన్న రామ్ చరణ్
  • గోడపై పెద్ద ఎన్టీఆర్ ఫొటో
  • అభిమానులను ఆకట్టుకుంటున్నఈ ఫొటో వైరల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెళ్లి రోజు సందర్భంగా హీరో రామ్ చరణ్ దంపతులు ఇటీవల ఆయన నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో పాల్గొని సందడి చేశారు. తాజాగా, హీరో రామ్ చరణ్ ఫొటోను జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ చేశాడు. 

ఈ ఫొటోలో రామ్ చరణ్ సోఫాలో కూర్చుని ఉండగా, ఆయన వెనుక ఉన్న గోడపై జూనియర్ ఎన్టీఆర్ తాతయ్య నందమూరి తారకరామారావు ఫొటో ఉండటం గమనించవచ్చు. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కాగా, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఓ మల్టీ స్టారర్ మూవీకి సంతకం చేసిన విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అరవింద సమేతా..’ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు.

More Telugu News