modi: చైనాకు బయల్దేరిన మోదీ.. ఆరు వారాల్లో రెండో సారి!

  • షాంఘై సహకార సంస్థ సమావేశాల్లో పాల్గొననున్న మోదీ
  • రెండు రోజుల పాటు జరగనున్న సమావేశాలు
  • జిన్ పింగ్ తో ప్రత్యేకంగా భేటీ కానున్న మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం చైనాకు బయల్దేరారు. ఆరు వారాల కాలంలో మోదీ చైనాకు వెళ్లడం ఇది రెండోసారి. క్వింగ్డావోలో రెండు రోజుల పాటు జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. ఈ సహకార సంస్థను విస్తరించిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు ఇవి.

గత ఏడాది కజకిస్థాన్ లో జరిగిన ఆస్తానా సమావేశాల్లో భారత్, పాకిస్థాన్ లకు శాశ్వత సభ్యత్వం కల్పించారు. శాశ్వత సభ్యత్వం లభించిన తర్వాత ఈ సమావేశాల్లో పాల్గొంటున్న తొలి భారత ప్రధాని మోదీనే. ఈ సమావేశాల్లో ఉగ్రవాదంపై పోరాటం, వాణిజ్యం, ఆరోగ్యం, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, పరస్పర సహకారం, తదితర అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు చైనా అధినేత జిన్ పింగ్ తో మోదీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ మధ్యాహ్నం 1.20 గంటలకు మోదీ క్వింగ్డావో చేరుకుంటారు.  

More Telugu News