rajanikanth: తెలుగు రాష్ట్రాల్లో 'కాలా' తొలిరోజు వసూళ్లు

  • రజనీ హీరోగా వచ్చిన 'కాలా'
  • చెన్నై లో తొలిరోజునే రికార్డు 
  • ఇతర ప్రాంతాల్లోను వసూళ్ల జోరు  

రజనీకాంత్ కథానాయకుడిగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన 'కాలా' .. ఈ నెల 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రజనీకి గల క్రేజ్ కారణంగా విడుదలైన ప్రతి చోటున ఈ సినిమా విజయవిహారం చేస్తోంది. చెన్నైలో తొలిరోజు వసూళ్ల విషయంలో రికార్డును సృష్టించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లోను అదే జోరును చూపించింది.

తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున ఈ సినిమా 3.5 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ వీకెండ్ లో ఈ సినిమా వసూళ్లు మరింత పెరగడం ఖాయమని అంటున్నారు. రజనీ ఛరిష్మా .. నానా పటేకర్ నటనలో సహజత్వం .. హుమా ఖురేషి గ్లామర్ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయని అంటున్నారు. ఇతర దేశాల్లోను ఈ సినిమా ఇదే రేంజ్ లో దూసుకుపోతోన్న నేపథ్యంలో, రజనీతో పా రంజిత్ మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది.   

More Telugu News