Narendra Modi: కెనడాలో 75 శాతం మందికి మోదీ ఎవరో తెలియదట!

  • యాంగస్ రీడ్ ఇన్స్టిట్యూట్ సర్వేలో తేలిన నిజం
  • జీ7 దేశాల సమావేశాలకు ముందు సర్వే
  • జపాన్ ప్రధాని ఎవరో 64 శాతం మందికి తెలియదు

భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. అత్యంత శక్తిమంతమైన నేతల జాబితాలో కూడా ఆయన ఉంటారు. అలాంటి మోదీ 75 శాతం మంది కెనడా ప్రజలకు తెలియదంటే నమ్ముతారా? ఇది ముమ్మాటికీ నిజం. మెజారిటీ భారతీయులకు ఈ వార్త మింగుడుపడనప్పటికీ ఇది వాస్తవం. కెనడాకు చెందిన యాంగస్ రీడ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఓ సర్వేలో ఇది తేలింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్ఠాత్మకమైన టైమ్ మేగజీన్ నిర్వహించిన 2016 ఆన్ లైన్ రీడర్స్ పోల్ లో టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా మోదీ ఎంపికయ్యారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకెర్ బర్గ్ లాంటి వారిని కూడా ఆయన వెనక్కు నెట్టేశారు. ఒక శక్తిమంతమైన నేతగా, వ్యూహకర్తగా, ప్రజలను ప్రభావితం చేయగలిగిన వ్యక్తిగా రెస్పాండెంట్లు ఆయనను పేర్కొన్నారు.

ఈ వారంలో క్యూబెక్ లో జీ7 దేశాల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముందు ఈ సర్వేను నిర్వహించారు. జీ7 గ్రూపులో అమెరికా, కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్, ఫ్రాన్స్, యూకేలు ఉన్నాయి. ఈ సర్వేలో మోదీతో పాటు జపాన్ ప్రధాని షింజో అబే కూడా నిలిచారు. 64శాతం మంది కెనెడియన్లకు జపాన్ ప్రధాని ఎవరో తెలియదట. బ్రెజిల్ అధ్యక్షుడు మిచెల్ టెమెర్ 90 శాతం మందికి తెలియదు.  

More Telugu News