Karnataka: 11 శాఖలను తన వద్దే ఉంచుకున్న కుమారస్వామి.. ఇంటెలిజెన్స్ కూడా!

  • రేవణ్ణకు పీడబ్ల్యూడీ
  • హోంశాఖ పరిధిలో ఉండే ఇంటెలిజెన్స్ కూడా సీఎం వద్దే
  • డీకే శివకుమార్ కు ఇరిగేషన్, ఆరోగ్య విద్య

కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. 25 మందితో ముఖ్యమంత్రి కుమారస్వామి తన కేబినెట్ ను విస్తరించారు. ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించారో వెల్లడైంది. పూర్తి స్థాయిలో సమాచారం లేనప్పటికీ కొన్ని పోర్ట్ ఫోలియోలు మాత్రం బయటకు పొక్కాయి.

ముఖ్యమంత్రి కుమారస్వామి 11 శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. ఇందులో అత్యంత కీలకమైన ఆర్థిక శాఖతో పాటు ఎనర్జీ, మౌలిక వసతులు, సమాచార మరియు ప్రజాసంబంధాలు, ఇంటెలిజెన్స్ శాఖలు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ వింగ్ హోంశాఖ పరిధిలో ఉన్నప్పటికీ ఆ విభాగాన్ని కుమారస్వామి తన అధీనంలో ఉంచుకున్నారు.

ఇతరులకు ఏయే శాఖలు దక్కాయంటే...

పరమేశ్వర (కాంగ్రెస్) - డిప్యూటీ సీఎం
హెచ్ డీ రేవణ్ణ (జేడీఎస్) - పబ్లిక్ వర్క్స్
ఆర్ వీ దేశ్ పాండే (కాంగ్రెస్) - రెవెన్యూ, స్కిల్ డెవలప్ మెంట్
డీకే శివకుమార్ (కాంగ్రెస్) - ఇరిగేషన్, ఆరోగ్య విద్య
కేజే జార్జ్ (కాంగ్రెస్) - పరిశ్రమలు, ఐటీ
జయమాల (కాంగ్రెస్, సినీ నటి, ఏకైక మహిళా మంత్రి) - మహిళాశిశు సంక్షేమం, కన్నడ సంస్కృతి శాఖ.

More Telugu News