musharraf: ముషారఫ్ పాస్ పోర్టు, గుర్తింపు కార్డులు రద్దు!

  • దేశ ద్రోహం కేసును ఎదుర్కొంటున్న ముషారఫ్
  • ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న మాజీ అధ్యక్షుడు
  • రాజకీయ ఆశ్రయం కోరవచ్చన్న అధికారులు

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆశలకు అడ్డుకట్ట పడింది. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న ఆయన అక్కడ నుంచి పాకిస్థాన్ కు తిరిగి వచ్చి, రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు ఆయన పాస్ పోర్టు, ఇతర గుర్తింపు కార్డులను పాకిస్థాన్ నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ అధికారులు రద్దు చేశారు.

దేశ ద్రోహం కేసును ఎదుర్కొంటున్న ఆయన పాస్ పోర్టు, గుర్తింపు కార్డులను రద్దు చేయాలంటూ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేశారు. అయితే ఆయన స్వదేశానికి తిరిగి రావాలనుకుంటే అందుకు తగిన డాక్యుమెంట్లు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులను గృహ నిర్బంధం చేసినందుకు, వందకు పైగా జడ్జిలను తొలగించినందుకు, 2007లో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినందుకుగాను ముషారఫ్ దేశ ద్రోహం కేసును ఎదుర్కొంటున్నారు. 2016 మార్చిలో వైద్య చికిత్స కోసం ఆయన దుబాయ్ వెళ్లారు. ఆ తర్వాత కొన్ని నెలలకు ముషారఫ్ ను నేరస్తుడిగా ప్రకటించిన ప్రత్యేక న్యాయస్థానం ఆయనపై ప్రయాణ నిషేధాన్ని విధించింది.

More Telugu News