austria: ఆస్ట్రియా సంచలన నిర్ణయం.. మసీదులన్నింటినీ మూసేసి.. ఇమామ్‌లను దేశంలోంచి పంపేస్తోన్న వైనం

  • ఇస్లాం మత సంస్థలకు అందుతున్న నిధులకు అడ్డుకట్ట
  • ఆ దేశంలో మొత్తం 7 మసీదులు 
  • వియన్నాలోని టర్కీ మసీదు ఇప్పటికే మూసివేత
  • త్వరలోనే మూతపడనున్న మరో 6 మసీదులు

తమ దేశంలోని మసీదులను మూసేయాలని యూరోప్ దేశం ఆస్ట్రియా కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, ఇస్లాం మత పెద్దలైన కొందరు ఇమామ్‌లను దేశం నుంచి బహిష్కరించాలని సంచలన నిర్ణయం తీసుకుంది. 2015లో రూపొందించిన చట్టం ప్రకారం ఈ విషయానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుని ప్రకటన చేసింది. విదేశాల నుంచి తమ దేశంలోని ఇస్లాం మత సంస్థలకు అందుతున్న నిధులకు ఇక అడ్డుకట్ట వేయనుంది.

తమ దేశంలో ఇస్లామిక్ రాజకీయాలు ఉండకూడదని నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో మొత్తం 7 మసీదులు ఉన్నాయి. వియన్నాలోని టర్కీ మసీదును మూసివేస్తున్నట్లు ఛాన్సలర్ సెబాస్టియన్ కుజ్ పేర్కొన్నారు. అలాగే, ఆ దేశంలో అరబ్ మత పెద్దలు నడుపుతున్న మరో 6 మసీదులు కూడా త్వరలోనే మూతపడతాయి.
 

More Telugu News