mahender reddy: ఆర్టీసీ చాలా నష్టాల్లో ఉంది.. సమ్మె వద్దని చెప్పాం: తెలంగాణ మంత్రి మహేందర్‌ రెడ్డి

  • ఈనెల 11 నుంచి సమ్మెకు పిలుపు
  • చర్చలు జరిపిన మహేందర్‌ రెడ్డి
  • రేపు నిర్ణయాన్ని ప్రకటించనున్న ఆర్టీసీ సంఘాలు

ఈనెల 11 నుంచి సమ్మెకు దిగాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ఆర్టీసీ సంఘాలతో ఆయన చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ... సంస్థకు ఇప్పటికే మొత్తం రూ.3000 కోట్ల అప్పులు ఉన్నాయని అన్నారు. ఒకవేళ వేతనాలు పెంచితే అదనంగా రూ.1400 కోట్ల భారం పడుతుందని అన్నారు.

సమ్మెకు దిగితే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని, సమ్మె నిర్ణయం వెనక్కి తీసుకుని చర్చలకు రావాలని కోరామని మహేందర్‌ రెడ్డి అన్నారు. కాగా, ఆర్టీసీ సంఘాలు మరోసారి తమ యూనియన్లతో చర్చలు జరిపి రేపు తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నాయి.                        

More Telugu News