samanta: 'రంగమ్మ మంగమ్మ' పాటకు చిన్నారి డ్యాన్స్.. సమంత ఫిదా!

  • 'రంగస్థలం' సినిమాలోని 'రంగమ్మ.. మంగమ్మ' పాట
  • ఇటీవల తాతయ్య పాటకు సమంత ఫిదా
  • తాజాగా సమంతను అలరించిన ఓ పిల్లాడి డ్యాన్స్ 

సమంత నటించిన 'రంగస్థలం' సినిమాలో 'రంగమ్మ.. మంగమ్మ' పాట చాలా పాప్యులర్‌ అయిపోయింది. ఆరేళ్ల పిల్లాడి నుంచి అరవై ఏళ్ల వృద్ధుడి వరకు అందరికీ నచ్చేసింది. ఇటీవల ఓ తాతయ్య పాడిన రంగమ్మ మంగమ్మ పాట బాగా వైరల్‌ అయిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోను సమంత కూడా రీట్వీట్‌ చేసింది. తాజాగా, ట్విట్టర్‌లో సమంత అభిమాని ఒకరు.. ఓ పిల్లాడు 'రంగమ్మ.. మంగమ‍్మ' పాటకు చేసిన డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేశాడు.

'ఈ పాట ఎంతో పాప్యులర్‌ అయింది. పదే పదే చూడకుండా ఉండగలవా సమంత?' అని ట్వీట్‌ చేశాడు. ఈ పిల్లాడు చేసిన డ్యాన్స్ సమంతకు తెగ నచ్చేసింది. ఈ వీడియో ఉన్న ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ 'ఓకే, నేను ఈ చిన్నోడిని కిడ్నాప్‌ చేస్తా' అంటూ సమంత సరదాగా ట్వీట్‌ చేసింది. 'రంగమ్మ మంగమ్మ' అంటూ ఆ బుజ్జిగాడు చేస్తున్న డ్యాన్స్ అందరినీ అలరిస్తోంది.

More Telugu News