modi: మోదీని హతమార్చాలన్న కుట్రను తీవ్రంగా పరిగణించాలి: రామ్ మాధవ్

  • మావోయిస్టులు చేస్తున్న కుట్రపై స్పందించిన రామ్ మాధవ్
  • ఇటువంటి నియంతృత్వ శక్తులను ఏకకంఠంతో ఖండించాలి
  • మావోయిస్టులు ఎదగలేకపోతున్నందుకు భయపడుతున్నారా?

భారత ప్రధాని నరేంద్ర మోదీని రాజీవ్ గాంధీ హత్య తరహాలో అంతమొందించేందుకు మావోయిస్టులు చేస్తున్న కుట్రను పూణె పోలీసులు బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ స్పందించారు.

ఇది చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలని, ఇటువంటి నియంతృత్వ శక్తులను ఏకకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజీవ్ గాంధీని హతమార్చిన పద్ధతిలో ప్రధాని మోదీని అంతమొందిస్తామని చెబుతున్న మావోయిస్టులు తాము ఎదగలేకపోతున్నామని భయపడుతున్నారా? అని ఆయన ప్రశ్నించారు.

ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ తమకు సహాయకారిగా ఉంటుందని మావోయిస్టులు భావిస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమని అన్నారు. కాగా, నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధాలు కలిగి ఉన్న ఐదుగుర్ని పూణె పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరి నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న లేఖ ద్వారా మోదీని హతమార్చేందుకు పన్నిన కుట్ర బయటపడింది.

More Telugu News