trivikram: త్రివిక్రమ్ దర్శకత్వంలో నాని మూవీ ఖరారైపోయినట్టే!

  • సెట్స్ పై 'అరవింద సమేత వీరరాఘవ'
  • లైన్లో వెంకీ .. త్రిష ప్రాజెక్టు
  • బయట బ్యానర్ లో చేసే ఛాన్స్       

ప్రస్తుతం త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కథానాయకుడిగా 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టేసినట్టుగా తెలుస్తోంది. వెంకటేశ్ కథానాయకుడిగా ఆయన ఒక సినిమాను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో వెంకటేశ్ సరసన త్రిష నటించే అవకాశాలు వున్నాయనే టాక్ వినిపిస్తోంది.నానీతోను త్రివిక్రమ్ ఒక సినిమా చేయనున్నాడనే వార్త వచ్చింది .. అది ఇప్పుడు నిజమేనని తెలుస్తోంది. ఈ కాంబినేషన్లో ప్రాజెక్టు ఖరారైపోయిందని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయిక ఎవరనేది ఇంకా అనుకోలేదు. ఈ రెండు సినిమాల్లో ముందుగా ఏ ప్రాజెక్టును త్రివిక్రమ్ మొదలెడతాడనే విషయమే ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాను మాత్రం హారిక అండ్ హాసిని బ్యానర్ పై కాకుండా, బయట బ్యానర్ పై త్రివిక్రమ్ చేయనున్నాడని చెప్పుకుంటున్నారు.     

More Telugu News