whatsapp: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్... ఫార్వార్డ్ మెస్సేజ్ లకు ప్రత్యేక లేబుల్

  • ప్రత్యేక సింబల్ తో కనిపిస్తుంది
  • సాధారణ మెస్సేజ్ లలో స్పష్టంగా గుర్తించే వీలు
  • ప్రస్తుతం బీటా వెర్షన్ లో, త్వరలో అందరికీ అందుబాటులోకి

వాట్సాప్ ఓ కొత్త ఫీచర్ ను ఆండ్రాయిడ్ బీటా (పరీక్షించే) వెర్షన్ లో ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ఏమిటంటే... ఎప్పుడైనా మెస్సేజ్ ను మరొకరికి ఫార్వార్డ్ చేస్తే ఆ మెస్సేజ్ ఇప్పుడైతే సాధారణ మెస్సేజ్ లతో కలిసిపోయి ఉంటుంది. కానీ, కొత్త ఫీచర్ లో ఫార్వార్డ్ లేబుల్ తో కనిపిస్తుంది. సాధారణ సందేశాలకు, ఫార్వార్డ్ మెస్సేజ్ లకు మధ్య భేదాన్ని స్పష్టంగా గుర్తించేందుకు గాను ఈ ఫీచర్ ను తీసుకొచ్చింది.

ప్రస్తుతం ఇది కేవలం బీటా వెర్షన్ లోనే ఉండగా, త్వరలోనే ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెగ్యులర్ వెర్షన్ లో ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్ పై వాట్సాప్ కొన్ని నెలలుగా పనిచేస్తోందని సమాచారం. ఫార్వార్డ్ చేసిన మెస్సేజ్ లేబుల్ తో పాటు సింబల్ రూపంలో కనిపించడమే ఈ ఫీచర్ ప్రత్యేకత.

More Telugu News