Indian Railway: టికెట్ తీసుకోకుండా రైలెక్కారో అయిపోయినట్టే.. నేటి నుంచి 22 వరకు రైల్వే స్పెషల్ డ్రైవ్!

  • నేటి నుంచి 22 వరకు ప్రత్యేక డ్రైవ్
  • దొరికితే భారీ జరిమానా
  • నకిలీ, ఫోర్జ్‌డ్ టికెట్లపైనా దృష్టి

టికెట్ లేకుండా ప్రయాణించేవారిపై విరుచుకుపడేందుకు రైల్వే సిద్ధమైంది. నేటి నుంచి ఈనెల 22 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్టు రైల్వే బోర్డు తెలిపింది. ఇందుకు సంబంధించిన నివేదికను 23న ప్రిన్సిపల్ కమర్షియల్ మేనేజర్లకు అందించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా టికెట్ లేని ప్రయాణికులకు భారీ జరిమానాలు విధించనుంది. టికెట్ ట్రాన్స్‌ఫర్, టికెట్ లెస్, నకిలీ, ఫోర్జ్‌డ్ టికెట్లపై అధికారులు దృష్టి సారించనున్నారు.

ఆలస్యంగా నడుస్తున్న రైళ్లను నిర్ణీత సమయంలో గమ్యానికి చేర్చేందుకు చర్యలు ప్రారంభించిన రైల్వే.. ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైలు ప్రయాణికులకు మరింత సురక్షితమైన, నాణ్యమైన సేవలు అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా టికెట్ బుకింగ్‌ను మరింత సులభతరం చేయనుంది. 20 గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తున్న రైళ్లలో భోజనం కోసం బయో డిస్పోజబుల్ ప్లేట్లు, వాటర్ బాటిళ్లను అందుబాటులో ఉంచనుంది.

More Telugu News