Thunderstorm: పిడుగును ఫొటో తీసేందుకు ప్రయత్నించి దానికే బలయ్యాడు

  • పిడుగును సెల్‌ఫోన్‌లో ఫొటో తీస్తుండగా ప్రమాదం 
  • తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే మృతి
  • తమిళనాడులో దుర్ఘటన 

పిడుగును ఫొటో తీసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి దానికే బలయ్యాడు. పిడుగును ఫొటో తీసే క్రమంలో తన పక్కనే పడుతున్న మరో పిడుగును గుర్తించలేకపోయిన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. తమిళనాడులోని గుమ్మడిపూండిలో జరిగిందీ ఘటన. చెన్నైలోని తురైపాక్కానికి చెందిన రమేశ్ (45), గుమ్మడిపూండి సమీపంలోని సున్నంబుకుళంలో ఉన్న స్నేహితుడి రొయ్యల చెరువు వద్దకు వెళ్లాడు.

అప్పటికే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. అదే సమయంలో దూరంగా పిడుగులు పడుతుండడంతో వాటిని తన సెల్‌ఫోన్‌లో బంధించాలని అనుకున్నాడు. రమేశ్ ఫొటోలు తీయడంలో బిజీగా ఉండగా, ఆయన సమీపంలో పడిన మరో పిడుగు అతడిని బలి తీసుకుంది. పిడుగుపాటుకు తీవ్ర గాయాలపాలైన రమేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు రమేశ్ మృతదేహాన్ని అందజేశారు.

More Telugu News