Bollywood: నెటిజన్ ప్రశ్నకు షారూక్ సరదా సమాధానం!

  • ‘ఆకాంక్ష’ అనే పేరు ఇష్టమన్న షారూక్
  • నేను మళ్లీ తండ్రి అయ్యే అవకాశం వస్తే పుట్టే బిడ్డకు ఆ పేరే పెడతా
  • నాల్గోసారి తండ్రి కాబోతున్నందుకు సంతోషమన్న నెటిజన్
  • ఇప్పటికే  నా హృదయమంతా నిండిపోయిందన్న షారూక్

‘ఆకాంక్ష’ పేరు అంటే తనకు ఎంతో ఇష్టమని, ఒకవేళ తాను మళ్లీ తండ్రి అయ్యే అవకాశం వస్తే పుట్టే బిడ్డకు ఆ పేరే పెడతానని ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ అగ్రనటుడు షారూక్ ఖాన్ చెప్పారు. అయితే, ట్విట్టర్ లో ‘ఆస్క్ షారుక్’ హ్యాష్ ట్యాగ్ తో అభిమానులు అడిగే ప్రశ్నలకు షారూక్ ఖాన్ సమాధానమిస్తుంటాడు. ఈ నేపథ్యంలో షారూక్ అభిమానులు ట్విట్టర్ ద్వారా ఆయనకు ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టారు.

‘మీరు నాలుగో సారి తండ్రి కాబోతుండటం నాకు చాలా సంతోషంగా ఉంది?..’ అంటూ నెటిజన్ స్పందించారు. ఈ ట్వీట్ కు షారూక్ బదులిస్తూ.. ‘ఓ మై గాడ్.. ఓ మై గాడ్! మీరు అనుకున్నది జరిగే లోపు నేను అబ్ రామ్ దుస్తులను దాచి పెట్టాలి. భవిష్యత్తులో పనికొస్తాయి కదా. అయినా, ఇప్పటికే అందమైన ముగ్గురు పిల్లలు, ప్రియమైన భార్య, ఓ సోదరితో నా హృదయమంతా నిండిపోయింది. ఇక ఖాళీలేదు’ అని షారూక్ చెప్పాడు.

More Telugu News