Tollywood: గల్లా జయదేవ్ ఛాలెంజ్ ను అంగీకరిస్తున్నా: హీరో సుమంత్

  • ‘హగ్ ఏ ట్రీ’ ఛాలెంజ్ కు స్పందించిన సుమంత్
  • సుమంత్ ను అనుకరించేందుకు యత్నించిన పెంపుడు శునకం
  • మరో ఐదుగురికి ఛాలెంజ్ విసిరిన హీరో

‘హగ్ ఏ ట్రీ’ పేరిట టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విసిరిన ఛాలెంజ్ కు హీరో సుమంత్ స్పందించారు. ఈ ఛాలెంజ్ కు అంగీకరిస్తున్నానని చెబుతూ, ఈ సందర్భంగా అఖిల్ అక్కినేని, నాగచైతన్య అక్కినేని, సమంతా, సుశాంత్, కృతీ ఖర్బందాకు సుమంత్ ‘హగ్ ఏ ట్రీ’ ఛాలెంజ్ విసిరారు.

ఓ చెట్టును సుమంత్ హగ్ చేసుకోగా, ఆయన పెంపుడు శునకం కూడా అదే చెట్టుపై తన రెండు కాళ్లు పెట్టి నిలబడింది. ఈ ఫొటోను సుమంత్ పోస్ట్ చేశారు. కాగా, తన ఛాలెంజ్ కు స్పందించినందుకు, ఈ ఛాలెంజ్ ను ముందుకు తీసుకెళ్తున్నందుకు సుమంత్ కు గల్లా జయదేవ్ కృతఙ్ఞతలు చెప్పారు.

More Telugu News