Rahul Gandhi: పారిశ్రామికవేత్తలకు రుణాలను మాఫీ చేస్తున్నామన్న ఆరోపణ అసత్యం: జైట్లీ

  • రాహుల్‌ గాంధీకి ఏం తెలుసు? ఎలా తెలుసు?
  • మేము ఒక్క రూపాయి రుణాన్ని కూడా మాఫీ చెయ్యలేదు
  • మీ పాలనలో భారత్‌లో అన్నీ చైనా ‌మొబైల్‌ ఉత్పత్తులే
  • రాహుల్‌ ఆరోపణలకు జైట్లీ కౌంటర్

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ఏం తెలుసు? ఎలా తెలుసు? అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఫేస్‌బుక్‌లో ప్రశ్నించారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీపై రాహుల్‌ చేసిన విమర్శలకు జైట్లీ కౌంటర్‌ ఇస్తూ... మధ్యప్రదేశ్‌లో రాహుల్ చేసిన ప్రసంగాన్ని విన్నానని అన్నారు. పదిహేను మంది అగ్ర పారిశ్రామికవేత్తలకు మోదీ సర్కారు రూ.2.5 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నారని ఆయన చెప్పినదంతా అసత్యమని పేర్కొన్నారు.

తాము ఏ పారిశ్రామికవేత్తకు కూడా ఒక్క రూపాయి రుణాన్ని కూడా మాఫీ చెయ్యలేదని అన్నారు. అలాగే రైతులకు కాకుండా పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇస్తున్నామన్నది కూడా నిజం కాదని చెప్పారు. ఆమధ్య విదేశాలకు పారిపోయిన ఇద్దరు వజ్రాల వ్యాపారులకు ఒక్కొక్కరికీ రూ.35 వేల కోట్ల చొప్పున మోదీ లోన్ ఇచ్చారని ఆరోపిస్తున్నారని, అది కూడా అసత్యమేనని, ఎందుకంటే ఆ మోసం యూపీఏ హయాంలో జరిగిందని వివరించారు.

అప్పట్లో జరిగిన దాన్ని తాము గుర్తించామని, అలాగే యూపీఏ పాలనలో భారత్‌లో చైనాలో తయారైన మొబైల్‌ ఉత్పత్తులే ఉన్నాయని అన్నారు. అప్పట్లో మన దేశంలో రెండు మొబైల్‌ ఫోన్‌ తయారీ సంస్థలు మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు మాత్రం వాటి సంఖ్య భారీగా పెరిగిందని చెప్పారు.

More Telugu News