Kajal Agarwal: రవితేజతో జోడీకడుతున్నట్టు చెప్పిన కాజల్

  • తమిళంలో హిట్ కొట్టిన 'తెరి'
  • రవితేజ హీరోగా తెలుగులోకి రీమేక్ 
  • ఒక కథానాయికగా కేథరిన్

తెలుగు .. తమిళ భాషల్లో మళ్లీ తన గ్రాఫ్ ను పెంచుకుంటూ కాజల్ ముందుకు వెళుతోంది. త్వరలో ఆమె రవితేజ సరసన మరో మారు కనిపించనుంది. ఓ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని కాజల్ స్వయంగా చెప్పింది. శ్రీను వైట్లతో 'అమర్ అక్బర్ ఆంటోని' చేస్తోన్న రవితేజ, ఆ తరువాత సినిమాను సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాలో కాజల్ కథానాయికగా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి.

ఈ ప్రాజెక్టును గురించి కాజల్ చెబుతూ .. "విజయ్ హీరోగా తమిళంలో హిట్ కొట్టిన 'తెరి' చిత్రాన్ని.. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఒక కథానాయికగా నేను నటిస్తున్నాను .. రీసెంట్ గా ఈ సినిమాకి సైన్ చేశాను" అని చెప్పింది. తమిళంలో సమంత చేసిన పాత్రను కాజల్ చేయనుండగా, ఎమీ జాక్సన్ పాత్రలో కేథరిన్ కనిపించనుంది. చాలా గ్యాప్ తరువాత సంతోష్ శ్రీనివాస్ చేస్తోన్న ఈ సినిమా ఆయనకి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.    

More Telugu News