China: చైనా బెదిరింపుల నేపథ్యంలో.. తైవాన్‌ యుద్ధ సన్నద్ధత పరిశీలన విన్యాసాలు

  • భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు చేపట్టిన తైవాన్‌
  • ఐదు రోజులు కొనసాగనున్న వైనం
  • మరింత దిగజారిన చైనా, తైవాన్‌ సత్సంబంధాలు

చైనా నుంచి వస్తోన్న బెదిరింపులు, ఒత్తిళ్ల కారణంగా తైవాన్‌.. ఫైటర్‌ జెట్లు, హెలికాఫ్టర్లు, వేలాది మంది జవాన్‌లతో భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు చేపట్టింది. 2016లో తైవాన్‌ అధ్యక్షురాలిగా సయి ఇంగ్‌ వెన్‌ ఎన్నికైన నాటి నుంచి ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి.

తైవాన్‌ కూడా తమ భూభాగమే అని భావిస్తోన్న చైనా తీరును ఆమె ఖండిస్తుండడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. చైనా బెదిరింపుల నేపథ్యంలో యుద్ధ సన్నద్ధత పరిశీలనకు ఈ విన్యాసాలు ఐదు రోజుల పాటు జరుగుతాయని ఆ దేశ అధికారులు తెలిపారు.                 

More Telugu News