chiranjeevi: 'సైరా' నుంచి చిరూ ఫస్టులుక్ రిలీజ్ అప్పుడే

  • 'సైరా' తాజా షెడ్యూల్ మొదలు 
  • 40 రోజుల పాటు నాన్ స్టాప్ గా షూటింగ్ 
  • వచ్చే వేసవిలో విడుదల

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి 151వ సినిమాగా 'సైరా' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా 30 శాతం వరకూ షూటింగ్ జరుపుకుంది. తాజా షెడ్యూల్ ఈ రోజున హైదరాబాద్ లో మొదలైంది. 40 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నారు.

 కొన్నిరోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ లో తాను పాల్గొన్న సన్నివేశాలకి సంబంధించిన కొన్ని ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అమితాబ్ పోస్ట్ చేయడం వలన, చిరంజీవి లుక్ ఎలా ఉంటుందనే విషయం తెలిసిపోయింది. అయితే అధికారికంగా ఈ సినిమా నుంచి చిరంజీవి ఫస్టులుక్ ను ఆయన పుట్టిన రోజైన ఆగస్టు 22వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ రోజున మెగా అభిమానులకి పండుగేనని చెప్పాలి. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను వచ్చే వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో వున్నారు.  

More Telugu News