YSRCP: రెండు రోజులు లేట్ అయింది.. వైసీపీ ఎంపీల రాజీనామాలతో ఒరిగేదేమీ లేదు: కొనకళ్ల

  • రాజీనామాలు చేసి రెండు నెలలైనా ఎందుకు ఆమోదింపజేసుకోలేదు?
  • ఉప ఎన్నికలు రాకపోతే రాజీనామా చేసి ఏం ప్రయోజనం?
  • బీజేపీతో వైసీపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోంది

వైసీపీ ఎంపీల రాజీనామాల వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని మచిలీపట్నం టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. రాజీనామాల వల్ల ఉప ఎన్నికలు వస్తేనే ఉపయోగం ఉంటుందని... ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని చెప్పారు. జూన్ 4వ తేదీకి ముందు రాజీనామాలను ఆమోదింపజేసుకుని ఉంటే వైసీపీ నేతల చిత్తశుద్ధి ప్రజలకు తెలిసేదని అన్నారు. రెండు రోజుల ఆలస్యంగా రాజీనామాలను ఆమోదింపజేసుకోవడం వల్ల ఉప ఎన్నికలు రావని చెప్పారు. వైసీపీ రాజీనామాలు ఓ డ్రామా అనే విషయాన్ని తాము ముందు నుంచి చెబుతూనే ఉన్నామని అన్నారు. రాజీనామాలు చేసి రెండు నెలలు అయినప్పటికీ... నిర్ణీత సమయం లోపల ఎందుకు ఆమోదింపజేసుకోలేదని ప్రశ్నించారు. రాజీనామాల డ్రామాకు 2015లోనే వైసీపీ తెరతీసిందని విమర్శించారు. అప్పుడే రాజీనామాలు చేసి ఉంటే వైసీపీ నేతల చిత్తశుద్ధిని తాము గౌరవించేవారమని చెప్పారు. బీజేపీతో వైసీపీకి ఉన్న కుమ్మక్కు రాజకీయాలను ఇది సూచిస్తోందని అన్నారు. 

More Telugu News