BSNL: రూ.99కే 20ఎంబీపీఎస్ స్పీడ్ తో బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్

  • రోజూ 20ఎంబీపీఎస్ వేగంతో కూడిన 1.5జీబీ డేటా
  • నెలలో 45 జీబీ హైస్పీడ్ డేటా
  • పరిమితి దాటిన అనంతరం స్పీడ్ 1 ఎంబీపీఎస్

బీఎస్ఎన్ఎల్ అతి తక్కువ చార్జీలకే నాలుగు నూతన బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను ఆవిష్కరించింది. కాకపోతే ఇవన్నీ కూడా కొత్తగా బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు తీసుకునే వారికి మాత్రమే. ఇప్పటికే యూజర్లుగా ఉన్న వారి కోసం కాదు. రూ.99 ప్లాన్ కింద ప్రతి రోజూ 1.5 జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. 30 రోజుల పాటు ప్రతి రోజూ 20 ఎంబీపీఎస్ వేగంతో కూడిన 1.5 జీబీ డేటా చొప్పున, నెలలో మొత్తం 45 జీబీ హైస్పీడ్ డేటా పొందొచ్చు. ఏదైనా ఒక రోజు 1.5 జీబీ డేటా క్రాస్ అయితే అప్పుడు వేగం 1ఎంబీపీఎస్ కు పడిపోతుంది.

ఇక రూ.199 ప్లాన్ కింద బీఎస్ఎన్ఎల్ 150 జీబీ ఉచిత డేటాను ఆఫర్ చేస్తోంది. అంటే ప్రతి రోజూ 20 ఎంబీపీఎస్ వేగంతో కూడిన 5 జీబీ డేటా ఉచితం. అలాగే, రూ.299 ప్లాన్ లో 300 జీబీ డేటా, రూ.399 ప్లాన్ లో 600 జీబీ డేటాను 20 ఎంబీపీఎస్ వేగంతో అందుకోవచ్చు. అన్ని ప్లాన్లలోనూ రోజువారీ అధిక వేగంతో కూడిన డేటా పరిమితి దాటిన వెంటనే వేగం 1ఎంబీపీఎస్ కు తగ్గుతుంది. కొత్తగా చేరే కస్టమర్లు ఈ టారిఫ్ లను ఆరు నెలల పాటే వినియోగించుకోగలరు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న ప్లాన్లలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

More Telugu News