French Open: పరాభవం... అనామకుడి చేతిలో ఘోరంగా ఓడిన జకోవిచ్!

  • నాలుగు సెట్లలోనే జకో ఓటమి
  • తొలిసారిగా గ్రాండ్ స్లామ్ క్వార్టర్స్ లో సెచినాటో
  • సుమారు మూడున్నర గంటల పాటు సాగిన మ్యాచ్

ఫ్రెంచ్ ఓపెన్ లో పెను సంచలనం నమోదైంది. తన కెరీర్ లో తొలిసారిగా ఓ గ్రాండ్ స్లామ్ క్వార్టర్ ఫైనల్ కు చేరిన అనామకుడు ఇటలీకి చెందిన మార్క్ సెచినాటో, వరల్డ్ టాప్ ప్లేయర్లలో ఒకరైన సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ ని ఓడించాడు. 12 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన జకో, ఈ మ్యాచ్ ని కనీసం 5వ సెట్ లోకి తీసుకెళ్లలేక, సెచినాటో చేతిలో ఓటమి పాలవడం గమనార్హం.

దాదాపు 3 గంటలా 26 నిమిషాలు సాగిన పోరులో  6–3, 7–6 (7/4), 1–6, 7–6 (13/11)తో 20వ సీడ్ గా బరిలోకి దిగిన జకోవిచ్ ని సెచినాటో బోల్తా కొట్టించాడు. తన గెలుపుతో 25 ఏళ్ల సెచినాటో తొలిసారిగా ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సెమీస్ కు చేరిన ఘనత సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్ కు ముందు అతను తన కెరీర్ లో ఎన్నడూ గ్రాండ్ స్లామ్ పోటీల రెండో రౌండ్ కు చేరకపోవడం గమనార్హం.

ఇక 1999 లో ఆండ్రీ మెద్వదేవ్ తరువాత, ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ కు చేరిన అతి తక్కువ ర్యాంక్ ఆటగాడిగా సెచినాటో నిలిచాడు. అంతేకాదు, 1978లో కొరాడో బారాజుటి తరువాత సెమీస్ చేరిన తొలి ఇటలీ ఆటగాడు కూడా సెచినాటోయే.

More Telugu News