sundar surya: ఒక హీరో అయిదు లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడు .. సినిమా చేయనన్నాడు!: 'అమ్మమ్మగారిల్లు' దర్శకుడు సుందర్ సూర్య

  • ఒక యంగ్ హీరోకి కథ వినిపించాం 
  • నచ్చిందని అడ్వాన్స్ తీసుకున్నాడు
  • ఆ తరువాత కథ నచ్చలేదన్నాడు .. అడ్వాన్స్ తిరిగి ఇవ్వడం లేదు        

బంధాలకు .. అనుబంధాలకు పెద్దపీట వేస్తూ .. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా 'అమ్మమ్మగారిల్లు'. సుందర్ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు ఇద్దరూ ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. "ఈ సినిమా కంటే ముందుగా మేమిద్దరం కలిసి ఓ ప్రేమకథా చిత్రం చేయాలనుకున్నాం. ఇంతవరకూ ఎవరూ అలాంటి లైన్ ను టచ్ చేయలేదు.

బౌండ్ స్క్రిప్ట్ ను రెడీ చేసి .. ఒక హీరోను కలిశాము. 'కథ నచ్చింది .. చేస్తాను' అని ఆ హీరో అంటే, అడ్వాన్స్ గా 5 లక్షలను ఇచ్చాము. ఆ తరువాత వచ్చి కథ నచ్చలేదన్నాడు. తన దగ్గర ఒక కథ ఉందనీ .. తనకి తెలిసిన ఒక డైరెక్టర్ వున్నాడని అన్నాడు. ఆ కథ నచ్చితే ఆ డైరెక్టర్ తో చేయడానికైతే ఓకే అని అన్నాడు. మేం కథ చెప్పిన తరువాత ఆ హీరో బిజీ కావడం వలన అలా మాట్లాడాడు. అడ్వాన్స్ గా ఇచ్చిన 5 లక్షలు ఆయన దగ్గరే వున్నాయి. సాధారణంగా సినిమా చేయకపోతే అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తుంటారు .. కానీ ఆ హీరో అలా చేయలేదు" అని చెప్పుకొచ్చారు.       

More Telugu News