High Court: 'కాలా' సినిమా నిషేధంపై జోక్యం చేసుకోము: కర్ణాటక హైకోర్టు

  • థియేటర్ల వివరాలు సర్కారుకి అందించాలి
  • ఈ సినిమా ప్రదర్శనలకు రాష్ట్ర సర్కారే భద్రత కల్పించాలి
  • న్యాయవాదులు, కర్ణాటక సర్కారుకి సూచనలు

విడుదలకు సిద్ధమైన సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ 'కాలా' సినిమాకు కర్ణాటకలో కష్టాలు తప్పేలా లేవు. ఆ రాష్ట్రంలో 'కాలా' విడుదలపై డిస్ట్రిబ్యూటర్లు నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ సినిమా యూనిట్‌ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ఈరోజు వారి పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు 'కాలా' సినిమా నిషేధంపై తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది.

అయితే, ఈ సినిమా ప్రదర్శనలకు భద్రత కల్పించాలని కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది. ఆ సినిమా విడుదల కానున్న థియేటర్ల వివరాలను రాష్ట్ర సర్కారుకే అందించాలని కాలా తరఫు న్యాయవాదాలకు చెప్పింది.          

More Telugu News