rajani: రజనీ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మేఘా ఆకాశ్?

  • కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీ 
  • కీలకమైన పాత్రలో విజయ్ సేతుపతి 
  • ముఖ్యమైన పాత్రలో బాబీ సింహా

తెలుగు తెరను ఈ మధ్యకాలంలో పలకరించిన కొత్త కథానాయికల జాబితాలో మేఘా ఆకాశ్ పేరు ముందు వరుసలో కనిపిస్తుంది. ఆమె నటించిన 'లై' .. ' ఛల్ మోహన్ రంగ' సినిమాలు రెండు పరాజయం పాలయ్యాయి. దాంతో అవకాశాలు వెతుక్కుంటూ రావడం కష్టమైపోయింది. ఈ నేపథ్యంలో ఈ సుందరి తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది.

ఆల్రెడీ అక్కడ సినిమాలు చేయడంలో అనుభవం వున్న ఈ అమ్మడు .. రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనేది తాజా సమాచారం. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. మరో ముఖ్యమైన పాత్ర కోసం బాబీ సింహాను తీసుకున్నారు. ఎవరి జోడీగా అనేది తెలియదు గానీ .. మేఘా ఆకాశ్ ను మాత్రం ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.   

More Telugu News